దేవుడు లేడు... దెయ్యాలే ఉన్నాయి: ప్రియదర్శన్ ఆవేదన

  • దేవుడు అన్నీ చూసుకుంటాడని అనుకుంటారా?
  • ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు
  • దేవుడో, మనమో ఆ చిన్నారికి సహాయం చేయలేదు
ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. పసిబాలికపై ఉన్మాదులు సాగించిన రాక్షసకాండ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘ఆసిఫాకు న్యాయం జరగాలి’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ (#JusticeforAsifa) పేరిట ఉద్యమం నడుస్తోంది.

 ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ సోషల్ మీడియా మాధ్యమంగా తీవ్రంగా స్పందించారు. ‘దేవుడు అన్నీ చూసుకుంటాడు’ అని ఇకపై కూడా అనుకుంటారా? మీరే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ సమయంలో మనమో, ఆ దేవుడో చిన్నారికి సహాయం చేయలేదు’ అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్‌ చేశారు. 'దేవుడు లేడు.. కేవలం దెయ్యాలే ఉన్నాయి' అంటూ ఆయన హ్యాష్‌ ట్యాగ్‌ ను కూడా జత చేశారు.
Go Back to Shorts
priyadarshan
director
movies

More Telugu News